టాలీవుడ్‌లో కమెడియన్‌గా, బజర్దస్త్ షోతో ప్రేక్షకులను నవ్వించిన వేణు ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారాడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్‌రాజ్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో హాస్యనటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించాడు. ఈ ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుంది. అసలు దర్శకుడు వేణు ప్రేక్షకులకు ఎటువంటి సినిమా చూపించాలనుకున్నాడు.. దాని ప్రజెంట్ చేయడంలో ఎంత వరకు సక్సెస్ అయ్యాడో చూద్దాం.
తెలంగాణలోని ఓ పల్లెటూర్లో ఉండే సాయిలు (ప్రియదర్శి)కి రెండు రోజుల్లో నిశ్చతార్థం ఉంటుంది. వచ్చే కట్నం డబ్బులతో తన అప్పులను తీర్చుకోవాలి అనే ఆలోచనలో ఉంటాడు సాయిలు. అయితే అనుకోని కారణాలతో తాతయ్య కొమురయ్య (సుధాకర్ రెడ్డి) చనిపోతాడు. అదే సమయంలో కుటుంబ గొడవలతో సాయిలు పెళ్లి కూడా రద్దవుతుంది.
అప్పులు కట్టడానికి ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాగా డబ్బున్న తన సొంత మేనత్త కూతురు సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్)ను పెళ్లి చేసుకుని తన కష్టాలు తీర్చుకోవాలని అనుకుంటాడు సాయిలు. అసలు సాయిలు ఎందుకు అప్పుల పాలవుతాడు?. తాత మరణానంతరం ఇంట్లో తలెత్తిన పరిణామాలు ఏంటి.. చివరకు గొడవలు పడుతున్న కుటుంబ సభ్యులు ఎలా కలిశారు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ మధ్య టాలీవుడ్‌లో.. తెలంగాణ యాస, ప్రాంతాలను, అక్కడి మనుషులను హైలైట్ చేయటం ట్రైండ్‌గా మారిందనే చెప్పుకోవాలి. ఇది కూడా అలాంటి సినిమానే. అయితే ఈ సినిమాను కమర్షియల్ ఫార్ములాలో పెద్ద హీరో, భారీ ఫైట్స్, అదిరిపోయే డాన్సులతో తెరకెక్కించలేదు. తెలంగాణలోని మారుమూల పల్లెటూళ్లో మనుషుల మధ్య బంధాలు, గొడవలను, భావోద్వేగాలను ప్రధానంగా చేసుకుని ‘బలగం’ సినిమాను రూపొందించారు.
ఈ సినిమా వేణుకి దర్శకుడిగా తొలి సినిమానే అయినప్పటికీ ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేశాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చూసే కోణంలో కాకుండా సహజత్వంతో కూడిన ఒక పల్లెటూరి కథను చూడాలనుకుంటే ‘బలగం’ మంచి ఛాయిసే. కన్నడలో ‘తిథి’ అని ఎనిమిదేళ్ల కిందట ఒక చిన్న సినిమా సంచలనం రేపింది. ఆ సినిమా తీసింది తెలుగువాడైన రామ్ రెడ్డినే. అది ఒక ‘చావు’ చుట్టూ తిరిగే సినిమా కావడం విశేషం.
చావు అంటే అదేదో ఏడుపుగొట్టు సినిమా అనుకుంటే పొరబాటే. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ.. ఆఖర్లో చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చి హృదయాల్ని తడి చేసే సినిమా అది. కమెడియన్ వేణు ‘బలగం’ తీయడానికి బహుశా ఆ చిత్రమే స్ఫూర్తి అయి ఉండొచ్చు. ఐతే అతను స్ఫూర్తి మాత్రమే పొందాడు.. దాన్ని కాపీ కొట్టలేదు. అతను రాసిన కథ కూడా చావు చుట్టూ తిరిగేదే. ఒక వ్యక్తి మరణంతో మొదలై ఆయన దశ దిన కర్మ వరకు జరిగే తంతునే ఈ సినిమాలో చూస్తాం.
కానీ సినిమాలో వినోదానికి ఢోకా లేదు. డ్రామా కూడా బాగానే పండింది. ఆఖర్లో ఎమోషన్లను కూడా బాగానే పండించి.. ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చాడు వేణు. కాకపోతే మధ్య మధ్యలో సాగతీతను.. రిపిటీటివ్ గా సాగే సన్నివేశాలు ఉన్నాయి.మనుషుల్లో మార్పు వచ్చే సందర్భంలో తెలంగాణ బుర్ర కథను వాడుకున్న తీరుకి వేణుని అప్రిషియేట్ చేయాల్సిందే. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటు, నేపథ్య సంగీతం బావున్నాయి.
సినిమాటోగ్రఫీ బావుంది. తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్ బావున్నాయి. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకు తాత పాత్రధారి కొమురయ్యగా నటించిన సుధాకర్ రెడ్డి ఈ సినిమాకి హైలైట్. తన పాత్ర చిన్నదే అయినప్పటికీ తను చక్కగా నటించారు. అలాగే అతని చుట్టూనే సినిమా నడుస్తుంది. ఇక ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. క్లైమాక్స్ ముందుకు వరకు సెల్ఫిష్ యువకుడిగా కనిపిస్తూ వచ్చిన ప్రియదర్శి క్లైమాక్స్‌లో తాతయ్యను తలచుకుంటు బాధపడే సీన్లో చక్కగా నటించాడు. మిగతా నటీనటులు అందరూ తమ పరిధి మేరకు నటించారు.
టైటిల్ :బలగం
నటీనటులు: ప్రియదర్శి-కావ్య కళ్యాణ్ రామ్-వేణు వెల్దండి-రచ్చ రవి తదితరులు
దర్శకత్వం: వేణు వెల్దండి
నిర్మాత: హర్షిత్ రెడ్డి-హన్సిత రెడ్డి
చివరిగా: చక్కని పల్లెటూరి కథ ‘బలగం’
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు