HomeTelugu Trendingపేదరికమే దూరం చేసిందన్న బలగం మురళీధర్ గౌడ్

పేదరికమే దూరం చేసిందన్న బలగం మురళీధర్ గౌడ్

balagam muralidharspe’బలగం’ సినిమాలో ఇంటి అల్లుడి పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్‌కు ఎంతో గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో మురళీధర్ గౌడ్ నటనను ప్రేక్షకులు మరిచిపోలేరు. ఆ తర్వాత క్యారెక్టర్ నటుడిగా ఆయన మరింత బిజీ అయ్యారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీధర్ గౌడ్ తన గురించిన అనేక విషయాలు పంచుకున్నారు. సినిమాల్లో నటించాలని, నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలనేది నా ఆశయం. నటించాలనే కోరిక నాలో బలంగా ఉన్నప్పటికీ, ఆ కోరికను బలవంతంగా అణచుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చాను.. దానికి కారణం పేదరికమే అన్నారు.

నటన పట్ల ఆసక్తి ఉన్నవారు వేరే పని చేయలేరని అంటారు. కానీ నేను చేసే జాబ్ నా కుటుంబానికి చాలా అవసరం. నా తల్లిదండ్రులను, పిల్లలను పోషించుకోవడానికి నాకు అంతకు మించిన మార్గం లేదు.

సినిమాల కోసం ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాలేను. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం. అందుకే రిటైర్మెంట్ తరువాతే సినిమాల దిశగా వచ్చాను అన్నారు మురళీధర్ గౌడ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu