-
శాండల్‌వుడ్ నటి సంజనాకు డ్రగ్స్ కేసులో ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు నటి సంజనకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ వ్యవహారంలో నటి సంజనాను సీసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత రెండు నెలల నుంచి సంజన పరప్పన అగ్రహార జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ .3,00,000 విలువైన బాండ్‌తోపాటు అంతే మొత్తం విలువైన రెండు పూచీకత్తు పత్రాలను సమర్పించాలనే షరతు విధించారు. అలాగే నెలకు ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించారు. ఇంతకు మందు సంజనా పలుమార్లు బెయిల్ దరఖాస్తు చేసుకోగా వాటన్నింటిని హైకోర్టు తిరస్కరించింది. కాగా ఇటీవల శాండిల్‌వుడ్‌ని డ్రగ్స్ కేసు కుదిపేసిన విషయం తెలిసిందే. సీసీబీ అధికారుల విచారణలో పలువురు కన్నడ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో పలువురిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన రెండో నటి సంజనా.