‘బాహుబలి2‘ విశేషాలు రాజమౌళి మాటల్లో
అక్టోబర్ 5న ప్రభాస్‌కు సంబంధించిన న్యూస్ ఏంటి? ప్రభాస్‌కు ఏమైనా ప్రఖ్యాత అవార్డు వచ్చిందా….?
అవార్డులకు సంబంధించిన న్యూస్ కాదండీ. మాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామో, మీరు అవ్వాలి. 5 న అందరికీ తెలుస్తుంది.
బాహుబలి 2 హైలైట్స్ చెప్పండి?
– ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకు సంబంధించిన విషయాలను ముందుగానే ఓ పద్ధతి ప్రకారం రవీల్ చేసుకుంటూ వచ్చాను. అయితే బాహుబలికి సంబంధించి ఎలాంటి విషయాలు చెప్పకూడదు, సినిమాలోనే చూడాలనేది నా అభిప్రాయం.
బాహుబలి2లో తమన్నా మీద సాంగ్స్ ఉంటాయా?
– సెకండాఫ్‌లో తమన్నా ఉంటుంది. కానీ ఆమె మీద పాటలు లేవు. అనుష్క ఇందులో హీరోయిన్. అనుష్క మీదనే పాటలు ఉంటాయి.
యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యిందా ?
– సినిమా లో కీలకమైన క్లైమాక్స్ అయిపోయింది. గ్రాఫిక్స్ విషయంలో, మనుషుల విషయంలో ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలిగాం. రెండున్నర నెలలు సమయం పట్టింది. ఎడిటింగ్ చేసి గ్రాఫిక్స్ చేశాం.
షూటింగ్‌లో ఇంకా ఏం చేయాల్సి ఉన్నాయి?
– రెండు పాటలు, చిన్న ప్యాచ్ వర్క్, ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంది.
ప్రభాస్, రాణా లను ఎప్పుడు విడిచి పెడతారు?
– డిసెంబర్ నెలలో రెండు వారాల్లో వారికి సంబంధించిన షూటింగ్ పూర్తవుతుంది. దాంతో ప్రభాస్,రాణా యే కాదు, అందరూ ఆర్టిస్ట్‌లు రిలీజ్ అవుతారు.
బాహుబలి పార్ట్ 3 ఉంటుందా?
– బాహుబలి అనే మహావృక్షం నుంచి చాలా సినిమాలు వస్తాయి. సినిమా అనేది కొమ్మ మాత్రమే. బాహుబలి పార్ట్ 3 అనేది ఆన్ ద కార్డ్స్. అది ఎలా వస్తుందో ఇప్పుడే చెప్పలేను.
వర్చువల్ రియాలిటీ ఎక్స్‌పీరియెన్స్‌తో ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారా?
– నేషనల్ ఆడియన్స్‌నే నేను టార్గెట్ చేశాను. వర్చువల్ రియాలిటీకి సంబంధించి ఎ.ఎం.డి వాళ్లతో కోలాబోరేట్ అయ్యాం. వాళ్లు నాణ్యతతో కూడిన లెటెస్ట్ కెమెరాలు,రిలేటెడ్ టెక్నాలజీ, దానికి సంబంధించిన స్టిచింగ్, హై క్వాలిటీ 360 డిగ్రీ ఇమేజ్‌ని తీసుకురావడానికి హెల్ప్ చేస్తున్నారు. లాస్ ఏంజెల్స్ లో గ్రాఫిక్స్ కంపెనీల్లో దానికి సంబంధించిన సీజీ వర్క్ జరుగుతోంది.
వర్చువల్ రియాలిటీని చేయడానికి ఇన్స్ పిరేషన్ ఎక్కడిది? ఈ టెక్నాలజీ కేవలం వార్ సీక్వెన్స్ కేనా?
– ఇది చాలా ఫ్లాట్‌ఫార్మ్స్ కి రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. సెట్ ఇన్ ద వార్. బట్ వార్ మాత్రమే ఉండదు. సినిమా మొత్తానికి ఉంటుంది.
బాహుబలి కి టైమ్ ఫ్రేమ్ ఏమన్నా పెట్టుకున్నారా?
ఫరెవర్. నాకు బాహుబలిని వదలాలని లేదు. వెస్ట్ లో ఫ్రాంచైసిస్ అనేది ఇంతే. స్టార్ వార్స్ వంటి సినిమాలు చుడండి. ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్లు పోయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమా కోసం ఆర్టిస్టులు పెట్టిన హార్డ్ వర్క్ సినిమా అయ్యాక ఆగిపోవాలని లేదు. కంటిన్యూ కావాలని ఉంది.