ఒక సినిమా సెన్సార్ పూర్తయితే ఆ సినిమా టాక్ బయటకు వస్తుంది. సినిమాలో హైలైట్స్, స్టోరీ లైన్ ఇలా ఏదొకటి తెలుస్తుంది. కానీ బాహుబలి2 సెన్సార్ అయిన సంగతి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉంచారు. అయితే నిన్ననే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ పొందిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి బాహుబలి టీం రెడీగా లేదు. దానికి వెనుక ఓ కారణం ఉంది.
ఈ సినిమాతో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ బాషల్లో విడుదల కానుంది. అన్ని భాషల్లో సెన్సార్ పూర్తయిన తరువాతే విషయాన్ని బయటకు చెప్పాలని నిర్ణయించుకున్నారు చిత్రబృందం. దాదాపు 250 కోట్లతో రూపొందిన ఈ సినిమా విడుదల కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.
మొదటి భాగంలో కంటే రెండో భాగంలో పాత్రలు మరింత బలంగా కనిపిస్తాయని అంటున్నారు. గ్రాఫిక్స్ వర్క్ కూడా మొదటి భాగానికి మించి ఉంటుందని తెలుస్తోంది. ఏపిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.