దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. దర్శకుడిగా ఆయన ఎదుగుతూనే ఎందరో నటులకు లైఫ్ ఇచ్చారు. అందులో బాహుబలి కాళకేయ పాత్ర కూడా అంతే ఫేమస్స్ అయింది. ఆ పాత్ర చేసిన ప్రభాకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘మర్యాద రామన్న’ సినిమాకు సెలెక్ట్ అయినప్పుడు తనకు డైలాగ్ చెప్పడం కూడా రాదని, రాజమౌళి గారు సొంతంగా డబ్బులు ఇచ్చి నటనలో మెలుకువలు నేర్పించారని అన్నారు. బాహుబలిలో అంతటి పవర్‌ఫుల్ పాత్ర ఇచ్చి నాకు దేవుడిగా మారాడు. మర్యాద రామన్న, బాహుబలి సినిమాలకి ముందు నేను పూర్తిగా అప్పుల్లో ఉన్నాను. ఈ రెండు సినిమాల వలన నేడు ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే తన కొడుక్కి కూడా రాజమౌళి అనే పేరు పెట్టుకున్న అన్నారు ప్రభాకర్.