తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో ఎదురుచూస్తోన్న సినిమా ‘బాహుబలి ది కంక్లూజన్’. ఈ సినిమా మొదటి భాగం సాధించిన విజయం రెండో భాగంపై అంచనాలను మరింత పెంచింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఆడియో విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధపడుతోంది. ఇప్పుడు సినిమా ఆడియో వేడుక ఎక్కడ జరపాలి..? ఎప్పుడు జరపాలనే విషయాలపై చిత్రబృందం ఓ క్లారిటీకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఉగాది రోజున ఆడియో విడుదల చేయాలనే ప్లాన్ లో రాజమౌళి ఉన్నట్లుగా సమాచారం. అంతేకాదు ఆడియో ఎక్కడ జరపాలనే విషయంలో విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడ ఇలా పలు పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా హైదరాబాద్ లోనే చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి కోసం వేసిన మాహిష్మతి సెట్ లో ఆడియో వేడుక నిర్వహించాలని అనుకున్నారు కానీ ఫిల్మ్ సిటీ నుండి సెట్ వరకు అభిమానులు వెళ్లడానికి కష్టం అవుతుందని ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ కు దగ్గరలోనే ఆడియో వేడుక కోసం ఓ వేదికను ఏర్పాటు చేయనున్నారు.
Attachments