నటి పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ ‘బ్యాక్ డోర్’ ఈనెల 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న సాయంత్రం (డిసెంబర్ 22, బుధవారం) హైద్రాబాద్, మాదాపూర్ లోని “డేట్ రెస్టారెంట్” లో ప్రి రిలీజ్ ఈవెంట్ అత్యంత కోలాహలంగా నిర్వహించారు.
ఈ వేడుకలో ప్రముఖ నటి-నిర్మాత-దర్శకురాలు జీవితా రాజశేఖర్, డైనమిక్ పోలీస్ ఆఫీసర్ & అడిషనల్ ఎస్.పి. కె.జి.వి.సరిత, కథానాయకి పూర్ణ, హీరో తేజ త్రిపురాన, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకులు ప్రణవ్, ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కందల కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శోభారాణి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నటి కరాటే కల్యాణి, ప్రముఖ దర్శకులు వీరశంకర్, అజయ్ కుమార్, సంతోషం సురేష్, ప్రముఖ నటులు అశోక్ కుమార్, రామ్ రావిపల్లి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు నిరంజన్, మాధవ్, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
“ఈట్ సినిమా… డ్రింక్ సినిమా..స్లీప్ సినిమాగా” అన్నట్లుగా సినిమానే సర్వస్వంగా భావించే కర్రి బాలాజీకి “బ్యాక్ డోర్” బ్లాక్ బస్టర్ కావాలని అతిధులు ఆకాంక్షించారు. తనకు “బ్యాక్ డోర్” వంటి మంచి సినిమా ఇచ్చిన కర్రి బాలాజీకి హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ కెరీర్ లో “బ్యాక్ డోర్” ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని పేర్కొన్న కర్రి బాలాజీ… ప్రి-రిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో విచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ…”బ్యాక్ డోర్” చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు… భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదల చేస్తున్నాం” అన్నారు.
ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ-ఖాజావల్లి, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల- చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, రిలీజ్: కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ.