యువ నటుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవ చైతన్య జంటగా నటించిన “బేబీ” మూవీ వసూళ్లలో దూసుకెళ్తోంది. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు.
జులై 14న విడుదలైన ఈ సినిమా 6 రోజులలో ప్రపంచవ్యాప్తంగా 43.8 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేనాటికి 50 కోట్ల మార్క్ టచ్ చేయడం ఖాయమంటున్నారు
కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను అందించిన సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ మూవీ యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ మూవీ ఫస్ట్ డే నుంచి హిట్ టాక్‌తో దూసుకు పోతోంది.