HomeTelugu Trending'బేబి' దర్శకుడి కొత్త సినిమా ప్రారంభం

‘బేబి’ దర్శకుడి కొత్త సినిమా ప్రారంభం

Baby director new movie lau

డైరెక్టర్ సాయిరాజేశ్.. తెరకెక్కించిన బేబి సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఈ సినిమా దర్శకుడిగా సాయిరాజేశ్ కు మంచి గుర్తింపు తెవడమే కాకుండా.. ఈ సినిమా నిర్మాత ‌కు కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో మరోసారి ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా రాబోతుంది.

సాయిరాజేశ్‌, ఎస్‌కేఎన్‌ కాంబోలో ప్రొడక్షన్‌ నంబర్‌ 4గా వస్తున్న ఈ చిత్రం ఇవాళ గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ఈ సినిమాకు మరోసారి రైటర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నాడు సాయిరాజేశ్‌. సంతోష్‌ శోభన్‌, అలేఖ్య హారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పూజాకార్యక్రమాలు హైదరాబాద్‌లో నిర్వహించారు.

అక్కినేని నాగచైతన్య ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. యూట్యూబర్‌గా సూపర్ ఫేమస్‌ అయిన అలేఖ్య హారిక ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. హీరోహీరోయిన్లపై ముహూర్తపు సన్నివేశానికి చైతూ క్లాప్ కొట్టాడు. సుమన్‌ పాతూరి డైరెక్ట్‌ చేస్తున్నాడు.

ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్‌, అమృత ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. విజయ్‌ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కూడా యూత్‌కు కనెక్ట్‌ అయ్యే లవ్‌ స్టోరీగా ఉండబోతుందట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu