HomeTelugu Trendingమరోసారి జంటగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

మరోసారి జంటగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

Baby combo repeat 1

బేబి మూవీ సంచలన విజయం సాధించిందిన సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ మూవీ బ్లాక్‍బాస్టర్ హిట్ అందుకుంది.

చిరంజీవి, అల్లు అర్జున్ సహా చాలా మంది ప్రముఖుల ప్రశంసలను అందుకుంది బేబీ మూవీ. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా రూ.90 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ట్రయాంగిల్ హార్డ్ హిట్టింగ్ లవ్ డ్రామాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు. మాస్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మరోసారి జోడీగా నటించనున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. కల్ట్ బ్లాక్‍బాస్టర్ బేబి కాంబో మళ్లీ వచ్చేస్తోందంటూ మాస్ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి సాయి రాజేశ్ కథను అందించగా రవి నంబూరి దర్శకత్వం వహిస్తారు. బేబి చిత్రాన్ని నిర్మించిన ఏస్‍కేఎన్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు.

బేబి చిత్రానికి సూపర్ మ్యూజిక్ ఇచ్చిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు.సినిమా షూటింగ్ మొదలైందని మాస్ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

కన్నీరు పెట్టుకుంటున్న వైష్ణవి చైతన్యను ఆనంద్ దేవరకొండ ఓదారుస్తున్నట్టు ఫస్ట్‌లుక్ పోస్టర్లో కనిపిస్తోంది. ఇది కూడా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఉండే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu