ప్రవచనా కర్త గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వైరల్ అయిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులలతో పాటు మెగాహీరోలని వ్యతిరేకించే రాంగోపాల్ వర్మ సైతం ఈ విషయంలో గరికపాటిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ వివాదంలోకి మానవహక్కుల కార్యకర్త బాబు గోనినేని కూడా దిగిపోయారు. ఆయన గరికపాటిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మహిళలపై.. అత్యాచారాలపై గరికపాటి నరసింహారావు గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసారు. అనుష్కను చూస్తుంటే గుండె దడదడలాడుతుందన్న అసభ్యకర వ్యాఖ్యలు వంటికి రుచించవని గరిక పాటిని ఉద్దేశించి గోగినేని అభిప్రాయపడ్డారు.
నరసింహారావు తెలుగు తాలిబాన్లా కనిపిస్తున్నారని..ఆయన మూర్ఖత్వం.. మహిళలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికారులను అభ్యర్థించినట్లు గోగినేని అభిప్రాయపడ్డారు. గరికపాటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ పేరును కూడా సరిగ్గా ఉచ్చరించలేడు. కానీ శాస్త్రీయ సిద్ధాంతాల గురించి మాత్రం లెక్చర్లు ఇస్తారు. ఇలాంటి వ్యాఖ్యలు తగవు అని గోగినేని మండిపడ్డారు. మొత్తానికి చల్లారింది అనుకుంటోన్న మంటపై బాబిగోనేని మళ్లీ నిప్పు పెట్టినట్లే కనిపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి ఈ వివాదంపై స్పందిస్తూ.. పెద్దాయన మాటలు పటించుకోనవసం లేదు అని తెలిపారు.