అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సంబంధించి ముందడుగు పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామమందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఓ ట్రస్టును ఏర్పాటు చేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు. ట్రస్టులో 15 మంది సభ్యులుంటారని, ఒకరు దళితవర్గానికి చెందిన వారు ఉంటారని, స్వతంత్రంగా ట్రస్ట్ వ్యవహరిస్తుందని తెలిపారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయోధ్యకూ 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్ గ్రామంలో ఈ స్థలం కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.