అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పై సుప్రీంకోర్టులో నేటితో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. అయోధ్య కేసులో చివరిరోజు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు వాడివేడిగా సాగాయి. అయితే తీర్పును మాత్రం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. నవంబర్ 17లోగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. అయితే డెడ్ లైన్‌కు ఓ గంట ముందే కోర్టు వాదనలు ముగించింది. వరుసగా 40 రోజుల పాటు రోజువారీ వాదనలు విన్నది సుప్రీం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వాదోప వాదనలకు ఈరోజు డెడ్‌లైన్ పెట్టారు. 40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదనలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తీర్పును వెలువరించనున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ 17వ తేదీన సీజేఐ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఆలోపే తీర్పు
వెలువడే అవకాశం ఉంది.
అయోధ్య రామమందిర నిర్మాణం, బాబ్రీ మసీదుకు దాఖలైన కేసులకు సంబంధించి 2001లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామలల్లా సంస్థలకు సమానంగా పంచాలని తీర్పులో పేర్కొంది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి