విజయవాడ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో అయేషాను దారుణంగా హత్య చేశారు. 2007 డిసెంబర్ 27 వ తేదీన అయేషా మీరాను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తరువాత ఈ కేసులో సత్యంబాబును అరెస్ట్ చేశారు. అతనికి కోర్టు 14 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. అయితే, హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా నిర్ధారించి విడుదల చేసింది.
ఈ కేసును 2018లో సిబిఐకి ఈకేసును అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ తనదైన శైలిలో విచారణ చేయడం ప్రారంభించింది. ఇక అయేషా మీరా తల్లి బేగం ఈ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. గత 12 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్టు చెప్పింది. ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, ఇప్పుడు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదని అన్నారు. అప్పట్లో అయేషా సంఘటన జరిగినపుడు రోజా హడావుడి చేసిందని, ఇప్పుడు ఈ విషయంలో సైలెంట్ అయ్యిందని, ఎందుకని రోజా మాట్లాడటం లేదని అన్నారు. అయేషా కేసులో నిందితులు ఎవరో రోజాకు తెలుసనీ అయేషా తల్లి పేర్కొన్నది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి దీనిపై రోజా ఎలా స్పందిస్తుందో చూడాలి.