అవికా గోర్ ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీకి ఎఫైర్స్ ఉన్నాయని చాలా ఏళ్ల నుంచే రూమర్స్ ఉన్నాయి. చిన్నారి పెళ్లికూతురు.. హిందీలో ఈ సీరియల్ పేరు ‘బాలికా వధు’. ఆ తర్వాత ఆమె ‘ససురాల్ సిమర్ కా’ అనే మరో సీరియల్‌లోనూ నటించింది. అందులో నటుడు మనీశ్ రాయ్‌సింఘన్‌తో కలిసి పని చేసింది. అయితే ఈ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని, వీళ్లు సీక్రెట్‌గా ఓ బిడ్డను కూడా కన్నారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి.
తాజాగా దీనిపై స్పందించిన అవికా గోర్.. అందుకు ఆస్కారమే లేదని కుండ బద్ధలు కొట్టేసింది. ‘మేం ఓ బిడ్డను కన్నామని, ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచామని అంటున్నారు. అది పూర్తిగా అవాస్తవం.13 ఏళ్ల వయసులో నటిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మనీశ్ నాకు స్నేహితుడు. అతడికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను. మా మధ్య ఏదైనా జరిగిందేమోనని ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు’
‘కానీ ఏం చెప్పను? అతడు మా నాన్న కంటే కొంచెం చిన్నవాడు. సరిగ్గా చెప్పాలంటే మా నాన్న వయసు. ఇక మా ఇద్దరి మధ్య సంబంధం ఉందని వచ్చిన కథనాలు మొదట్లో మా మీద ప్రభావాన్ని చూపించాయి. రెండు వారాలపాటు మేమిద్దరం మాట్లాడుకోలేదు కూడా! కానీ మళ్లీ అలాంటి పుకార్లు వస్తూనే ఉంటడంతో అసలు దూరంగా ఉండటంలో అర్థం లేదనిపించింది. ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్‌లా కలిసిపోయామని అవికా గోర్ చెప్పింది.