తెలుగు ప్రక్షకులకు ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో పరిచయమైంది అవికాగోర్. ఆ తరువాత టాలీవుడ్లో ‘ఉయ్యాలా జంపాలా సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. చూపిస్త మావ, ఎక్కడికిపోతావు చిన్నవాడా వంటి పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. మధ్యలో సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకున్న ఈ చిన్నది ‘రాజుగారిగది 3’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజా బరువు తగ్గి సన్నజాజి తీగలాగా తయారైన అవికాగోర్.. తన జీవిత భాగస్వామిని పరిచయం చేసింది. చంద్వాని మిలింద్‌ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు అవికా తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. మనల్ని జాగ్రత్తగా చూసుకునేవారు, స్ఫూర్తినిచ్చేవారు, ప్రేమను పంచేవారు కావాలని, కానీ అది అసాధ్యమని చాలా మంది భావిస్తారు. కానీ నాకు అలాంటి వ్యక్తి దొరికాడంటూ అవికా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది.