తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు సీరియాల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అవికా గోర్. పెద్దాయ్యాక రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా అవి కలిసి రాలేదు. చివరిగా రాజుగారి గది3లో ఈ అమ్మడు కనిపించింది. తరువాత కొంత గ్యాప్ తీసుకుంది. మళ్లీ ఇప్పడు ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు అక్కినేని పెద్దకొడుకు నాగచైతన్య సరసన చేసేందుకు ఎంపికయ్యింది. ఈ ఆఫర్ వచ్చిన వెంటనే ఆలోచించకుండా ఓకే చెప్పిందట ఈ అమ్మడు.
నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘థాంక్యూ’ సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం వచ్చింది. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు వారిలో ఇప్పటికే ఇద్దరి పాత్రల్లో రాకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక అరుల్‌లు ఎన్నికయ్యారు. ఇప్పుడు మూడో హీరోయిన్‌గా అవికా ఫైనల్ అయ్యింది. మరి ఈ సినిమాలో నాగచైతన్యా ముగ్గురు ముద్దుగుమ్మలతో ఓకే సారి నటించనున్నాడు. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.