బెల్లంకొండ గణేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె. కృష్ణ డైరెక్టర్‌గా పరియమైన ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుని విజయవంతంగా దూసుకుపోతుంది.
ఈక్రమంలో బెల్లంకొండ గణేష్ మరో సినిమాని ‘నేను స్టూడెంట్ సార్’ మొదలు పెట్టేశాడు. ఈ మూవీని ఎస్ వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రాఖీ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథ అందించారు.ఈ సినిమాతో టాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. సోమవారం హీరోయిన్ అవంతిక ఫస్ట్‌లుక్ పోస్టర్ ని విడుదల చేసింది మూవీయూనిట్. సినిమాలో అవంతిక కాలేజీ స్టూడెంట్ శృతి వాసుదేవ్ గా కనిపించబోతోంది. ఈ సినిమాకు మహతి సంగీతం అందించారు.