‘జబర్దస్త్’ హాస్యనటుడు, బిగ్బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ రోజు (బుధవారం) ఆమె మెడలో మూడు మూళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. అనుజ మెడలో అవినాష్ తాళికట్టే దృశ్యాల్ని ‘ఆటో’ రామ్ ప్రసాద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘క్షమించు అవినాష్. చాలా పెద్ద తప్పు జరిగింది. నేను సాయం చేయలేకపోయాను’ అని సరదా వ్యాఖ్యని జోడించారు. అవినాష్ అభిమానులు, సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు నూతన దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు.