వినోదం
Pooja Hegde ప్రమోషన్ల వెనుక అసలు కారణం ఇదేనా?
Pooja Hegde in Retro Promotions:
ఒక టైంలో టాలీవుడ్‌లో హాట్ కేక్ లా మారిపోయిన హీరోయిన్ పూజా హెగ్డే, స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. మహేశ్ బాబు నుంచి అల్లు అర్జున్ వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసింది. కానీ వరుసగా వచ్చిన ఫ్లాప్స్ వల్ల అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో పూజా హెగ్డే కూడా పెద్దగా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మాత్రమే హాజరవ్వటం, కన్‌జాయింట్ ఇంటర్వ్యూలతో సరిపెట్టడం వల్లా ఇండస్ట్రీలో ఆమెపై నెగటివ్ ఇంప్రెషన్ పడింది.
దీంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఆమెకు రేట్ ఎక్కువ అని ఫీలై, కొత్త ఫేసెస్ వైపు మొగ్గుపడ్డారు. హిందీ సినిమాల్లో ఆమెను చూసే ట్రై చేశారు కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ రాలేదు. కానీ ఇప్పుడు 'రెట్రో' అనే సినిమాతో తిరిగి టాలీవుడ్‌కి రావాలని డెసైడ్ అయింది పూజా.
ఇటీవల హైదరాబాదులో ఉన్న పూజా హెగ్డే, మీడియా ఇంటర్వ్యూలు వ్యక్తిగతంగా ఇవ్వడం, ప్రతి ఛానెల్‌కీ స్పెషల్‌గా మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంకా స్పెషల్ విషయం ఏంటంటే… ఆమె తెలుగు మాట్లాడే ప్రయత్నం చేస్తోంది! ఇదన్నీ చూస్తుంటే, పూజా నిజంగా టాలీవుడ్‌లో మళ్లీ సెటిలవ్వాలని చూస్తోంది అనిపిస్తుంది.
అయితే, ఇప్పుడు ఆమె రెమ్యూనరేషన్‌కి కూడా తగ్గతనం చూపుతోందట. త్వరలో రొమాంటిక్ ఎంటర్టైనర్ టైటిల్‌తో ఓ సినిమా సైన్ చేసిందని ప్రకటించింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టులు టచ్‌లో ఉండటమే కాదు, ప్రమోషన్లకు కూడా హాజరవడమంటే పూజా హెగ్డే ఈసారి నిజంగా సీరియస్ అన్న మాట!