August 15 releases:
ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం మాస్ ప్రేక్షకులకు పండుగ. పేరుకి నాలుగైదు సినిమాలు విడుదలవుతున్నా కూడా.. అందరి కళ్ళు ఉన్నది రెండే రెండు సినిమాల మీద. అందులో ఒకటి మిస్టర్ బచ్చన్.. మరొకటి డబుల్ ఇస్మార్ట్.
రెండు సినిమాలు ఆగస్టు 15న విడుదల కాబోతున్నాయి. అయితే రెండు సినిమాల్లో ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్ మాస్ ఎలిమెంట్లు. కదా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఈ రెండు సినిమాలు కచ్చితంగా మాస్ ప్రేక్షకులకు కనుల విందు చేస్తాయి అని ట్రైలర్లు చూస్తేనే తెలుస్తోంది.
అయితే రెండవ సినిమాలలోనూ కమర్షియల్ ఎలిమెంట్లు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో కథ ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మిస్టర్ బచ్చన్ హిందీలో రైడ్ సినిమాకి రీమేక్ గా రాబోతోంది. నిజానికి ఇది చాలా సీరియస్ సినిమా. కనీసం ఇందులో రెండు మూడు పాటలు కూడా ఉండవు. ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదు.
కానీ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ చూస్తే సినిమాలో రొమాన్స్, ఫైట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే రీమేక్ సినిమాలు తీయడంలో హరీష్ శంకర్ కి డిఫరెంట్ స్టైల్ ఉంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని ఈ సినిమా రిజల్ట్ తో తెలిసిపోతుంది.
మరొకవైపు డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా కొంచెం అటు ఇటుగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలాగానే అనిపిస్తుంది. మరి ఈ సినిమాలో కదా ఎంతవరకు ఉంటుంది అనేది కూడా తెలియడం లేదు. కానీ రెండు సినిమాల ట్రైలర్లు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. రెండు సినిమాల మీద మంచి హైప్ కూడా ఉంది.
అంతేకాకుండా మిస్టర్ పర్సన్ సినిమా హిట్ అవడం రవితేజ కి ఎంత కీలకమో డబ్బులు ఇస్మార్ట్ సినిమా హిట్ అవడం కూడా పూరి జగన్నాథ్ కి అంతే కీలకం. మరి ఈ రెండు సినిమాలు వీళ్ళిద్దరికీ మర్చిపోలేని ఈ విజయాలను అందిస్తాయో లేదో వేచిచూడాలి.