HomeTelugu Trendingఖిలాడి: 'అట్టా సూడకే'.. థర్డ్ సింగిల్ వచ్చేసింది

ఖిలాడి: ‘అట్టా సూడకే’.. థర్డ్ సింగిల్ వచ్చేసింది

Attasudake Lyrical song fro
రమేష్ వర్మ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఖిలాడి’ రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గతంలో ఈ మూవీ నుంచి విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘ఖిలాడీ’ నుంచి థర్డ్ సింగిల్ విడుదలైంది.

“అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే .. ఒంట్లో వేడికే పిచ్చెక్కు తాంది నాడికే” అంటూ ఈ పాట సాగుతోంది. ‘ఖిలాడీ’ పెప్పీ పార్టీ సాంగ్ పర్ఫెక్ట్ న్యూఇయర్ ట్రీట్ అని చెప్పొచ్చు. శ్రీ మణి సాహిత్యం అందించిన ఈ పాటను సమీరా భరద్వాజ్‌తో కలిసి దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా పాడారు. లిరికల్ వీడియోలో హీరోహీరోయిన్లతో పాటు అద్భుతమైన కాస్ట్యూమ్స్, సెట్‌ విజువల్స్‌ను మరింత అట్ట్రాక్టివ్ గా చేస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కానంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu