HomeTelugu Trendingఆర్జీవీ ఆఫీసుపై దాడి

ఆర్జీవీ ఆఫీసుపై దాడి

Attack on RGV office
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ”పవర్ స్టార్” అనే సినిమా తెరక్కెకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎవరినీ ఉద్దేశించి తీయడం లేదు అని వర్మ చెప్తున్నప్పటికీ.. ఆ సినిమా ఎవరికోసం తీస్తున్నాడో ఇట్టే తెలిసిపోతుంది. నిన్న ‘పవర్ స్టార్’ ట్రైలర్ విడుదల చేశాడు వర్మ. దాంతో సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ సినిమాను రేపు జులై 24న ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాకి పోటీగా పవన్ ఫ్యాన్స్ కూడా ‘పరాన్నజీవి’. ‘రెక్‌లెస్ జెనెటిక్ వైరస్’ అనేది ట్యాగ్ లైన్ తో వ‌ర్మపై సినిమా తీస్తున్నారు. అయితే తన సినిమా గురించి వార్నింగ్‌లు ఇస్తే భయపడడానికి ఇక్కడ ఎవడూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు అని వర్మ కామెంట్ చేశాడు. ఈరోజు హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని వర్మ కార్యాలయం పై కొంతమంది రాళ్లతో దాడి చేశారు. జనసేన కార్యకర్తలు దాడికి
పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవీ, పవర్ స్టార్ పేరుతో తాను తీస్తున్న సినిమా, విడుదలయిన ట్రైలర్ కు వ్యతిరేకంగా ఈదాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో తెలిపాడు. వర్మ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu