
Atlee in Highest Paid Directors List:
డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “జవాన్” సినిమా వదిలిన తర్వాత అతని మార్కెట్ మిగిలిన దర్శకులకు ఓ బిగ్ ఎగ్జాంపుల్ లా మారింది. ఇప్పటికీ అతడు డైరెక్ట్ చేసిన మొత్తం సినిమాలు ఆరు మాత్రమే. కానీ అవన్నీ బ్లాక్‌బస్టర్‌లు.
ఇప్పుడు అట్లీ కొత్తగా డైరెక్ట్ చేయబోయే సినిమా “AA22 X A6”. ఇందులో హీరోగా అల్లు అర్జున్ నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ మీద ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరి, అట్లీ ఈ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ంటే… ఒకసారి వినండి – అక్షరాలా 100 కోట్లు!
“జవాన్” సినిమా సమయంలో అట్లీ తన రెమ్యునరేషన్‌ను 30 కోట్లకి తగ్గించాడు. కానీ ఇప్పుడు అదే డైరెక్టర్ అల్లు అర్జున్ సినిమాకు 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. అంటే సుమారు 233% పెరిగిన రెమ్యునరేషన్. ఇది వినగానే టాలీవుడ్, బాలీవుడ్‌లో షాక్‌కి గురవుతున్నారు అందరూ!
ప్రస్తుతం అట్లీ ఇండియాలో మూడవ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్. మొదటిగా ఎస్.ఎస్. రాజమౌళి ఉన్నారు – ఆయన ఒక్కో సినిమాకు 200 కోట్లు తీసుకుంటున్నారు. రెండవ స్థానం సందీప్ రెడ్డి వంగాకు – 100 నుంచి 150 కోట్ల మధ్య. ఇక మూడవ స్థానంలో అట్లీ.
అట్లీ ఇప్పుడు పేరే కాదు, బ్రాండ్. “మెర్సల్”, “బిగిల్”, “జవాన్” అన్నీ అతని టాలెంట్‌కి నిదర్శనాలు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలసి ఏ మాయ చేయబోతున్నాడో చూడాలి. ఏదైనా, అట్లీ ఇప్పుడు టాప్ లీగ్ డైరెక్టర్లలో దూసుకుపోతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు!