HomeTelugu Trending'అతిథి దేవోభవ' ట్రైలర్‌ విడుదల

‘అతిథి దేవోభవ’ ట్రైలర్‌ విడుదల

Atithi Devo Bhava Movie Tra
సంక్రాంతి బరిలో పలు చిన్న సినిమాలు ఉన్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీలోగా చాలా సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. ఈ జాబితాలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘అతిథి దేవోభవ’ కూడా ఉంది. మిర్యాల రామ్ – అశోక్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించాడు.

శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల. హీరో నాని చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ .. అలకలు .. ఆపై గొడవలు .. అపార్థాలు తొలగిపోవడం ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి.

ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో నువేక్ష హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ సినిమాతో ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి. ముఖ్యమైన పాత్రల్లో రోహిణి .. సప్తగిరి కనిపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu