ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అతిథి దేవోభవ’. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. కొన్ని సరదా సన్నివేశాలు, ట్విస్ట్‌లతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. టీజర్‌లో వినిపించిన డైలాగ్స్‌ని బట్టి ఈ సినిమాలో హీరోకి ఏదో లోపం ఉన్నట్టు అర్థమవుతుంది. ‘ఒకడు చెప్పాడని ఇంకొకడితో చేయించేవాడు కాదురా.. ఎవడిది వాడు సెట్ చేసుకున్నోడే దమ్మునోడు’ అనే పవర్‌ఫుల్ డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో ఆది సరసన నువేక్ష హీరోయిన్‌గా నటిస్తుంది. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సినీ క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రాజాబాబు, అశోక్‌రెడ్డి నిర్మిస్తున్నారు.