క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అథియా శెట్టి ఒక్కటయ్యారు. జనవరి 23న ‘ఖండాలా’ ఫామ్ హౌస్ లో వివాహం చేసుకున్నారని నటి తండ్రి.. స్టార్ హీరో సునీల్ శెట్టి అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి అథియా శెట్టితో భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ పెళ్లి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. ఈ పెళ్లికి కొద్దిమంది సన్నిహితులు బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.
కొత్తగా పెళ్లయిన జంట ఇన్ స్టాలో పెళ్లి వార్తలను షేర్ చేసారు. పెళ్లి వేడుక నుంచి కొన్ని అందమైన ఫోటోలను వీడియోలను కూడా రిలీజ్ చేయగా వైరల్ అయ్యాయి. ”ఈరోజు మా అత్యంత ప్రియమైన వారితో మా ఇంట్లో పెళ్లి చేసుకున్నాం. ఇది మాకు అపారమైన ఆనందాన్ని ఇచ్చింది. కృతజ్ఞతలు.. ప్రేమతో నిండిన హృదయంతో మీ ఆశీర్వాదం కోరుతున్నాము” అని ఆథియా ఎమోషనల్ గా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతున్నాయి. ఇక అథియా లెహంగ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.
https://www.instagram.com/p/CnwtWxgKsK9/?utm_source=ig_web_copy_link