ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి ఈ నెల 23న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకు వివాహ వేడుకలు జరగనున్నట్టు విశ్వసనీయ వర్గాల ఆధారంగా ఇండియా టుడే సంస్థ వెల్లడించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారానికి కూడా వచ్చాయి. కాకపోతే వివాహమే ఆలస్యం అవుతూ వచ్చింది.
వీరి వివాహం మూడు రోజుల పాటు ఉంటుందని సమాచారం. ఖండాలాలోని (ముంబై సమీప ప్రాంతం) సునీల్ శెట్టి నివాసంలో జరిగే పెళ్లి వేడుకకు ప్రముఖులతో పాటు సన్నిహితులను ఆహ్వానించనున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారని, అతిథుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలిసింది. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, క్రికెట్ రంగం నుంచి ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తదితరులు వివాహ వేడుకకు హాజరవుతున్నట్లు సమాచారం