సస్పెన్స్, క్రైమ్ జానర్‌తో యూత్‌కు నచ్చేలా రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కింన చిత్రం ‘అథర్వ’. కార్తీక్ రాజు హీరోగా, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాణ అనంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెన్సార్ జరుగుతోంది.
నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. మహేశ్ రెడ్డి దర్శకత్వంలో సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.
అథర్వ మూవీపై ముందు నుంచీ ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అథర్వ సినిమాలో క్లూస్ టీం విశిష్టతను, ప్రాముఖ్యతను చూపించేలా గ్రిప్పింగ్ కథనంతో అందరినీ ఆశ్చర్యపరచబోతున్నారు.
‘ది సీకర్ ఆఫ్ ది ట్రూత్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘అథర్వ’ సినిమాను డిసెంబర్ 1న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ‘అథర్వ’ చిత్రంపై దర్శక నిర్మాతలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు.