HomeTelugu News'యాత్ర' లో విజయయ్మగా అనుష్క వదిన..!

‘యాత్ర’ లో విజయయ్మగా అనుష్క వదిన..!

2 6టాలీవుడ్‌లో వరుసగా బయోపిక్ సినిమాలు విడుదల అవుతున్నాయి. మహానటి విజయం తరువాత ఈ పరంపర కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. ఫిబ్రవరి 8 వ తేదీన రిలీజ్ కాబోతుంది.

ప్రముఖ నటుడు మమ్మూట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తుంటే.. రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపిస్తున్నారు. వీరితోపాటు మరికొన్ని కీలకమైన పాత్రలకు ఇప్పటికే స్టార్ నటీనటులను ఎంపిక చేశారు. ఇందులో రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ పాత్రను ఎవరు చేస్తున్నారు అనేదానిపై క్లారిటీ లేదు. అసలు ఆ పాత్ర ఉంటుందా లేదా అన్నది కూడా తెలియలేదు. తాజాగా, విజయమ్మ పాత్రను యూనిట్ రివీల్ చేసింది. వైఎస్ విజయమ్మ పాత్రను వేముగంటి ఆశ్రీత చేస్తోంది. బాహుబలి సినిమాలో అనుష్క వదినగా నటించింది. కన్నా నిదురించారా అనే సాంగ్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఆశ్రీత క్లాసికల్ డ్యాన్సర్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu