టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. తాజాగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విద్యాసాగర్ చింత డైరెక్షన్ లో ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. పెళ్లి కోసం ఆరాటపడే మిడిల్ క్లాస్ యువకుడిలా కనిపించి మంచి ఆసక్తి రేపిన విశ్వక్ సేన్ ఫైనల్‌గా తన పెళ్లి తేదీతో కూడిన పోస్టర్‌తో సినిమా రిలీజ్‌ను ప్రకటించాడు. మార్చి4న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక విశ్వక్‌సేన్‌కు జోడీగా రుక్సార్ థిల్లోన్ అలరించనుంది.