సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం రెండో సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అర్జున్ జంధ్యాల దర్శకత్వలో అశోక్ గల్లా 2వ గా వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఫైనల్ చేస్తూ.. టీజర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.
ఈ చిత్రానికి దేవకీ నందన వాసుదేవ టైటిల్ ఫిక్స్ చేశారు. నీ బిడ్డకు మరణగండం.. లేదా అతని చేతిలో మరొకరికి మరణం అంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది టీజర్. ఈ చిత్రానికి
జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి కథని అందిస్తున్నాడు. బురదలో జరిగే ఫైట్ సన్నివేశంతో కట్ చేసిన ఫస్ట్ యాక్షన్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రొడక్షన్ నంబర్ వన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు.
భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ కాగా తమ్మిరాజు ఎడిటర్. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేసిన గుణ 369 బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో అర్జున్ జంధ్యాల ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.