HomeTelugu Trendingమహేష్ మేనల్లుడి‌.. సినిమా ప్రారంభం.. హీరోయిన్‌ ఎవరో తెలుసా!

మహేష్ మేనల్లుడి‌.. సినిమా ప్రారంభం.. హీరోయిన్‌ ఎవరో తెలుసా!

1 10ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ హీరోగా రూపొందనున్న తొలి సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఈ శుభకార్యానికి వేదికైంది. ఈ కార్యక్రమానికి గల్లా కుటుంబ సభ్యులతోపాటు సినీ ప్రముఖులు కృష్ణ, నరేశ్‌, రామ్‌ చరణ్‌, రానా తదితరులు హాజరై సందడి చేశారు. ముహూర్తపు సన్నివేశానికి రామ్‌ చరణ్‌ క్లాప్‌ కొట్టారు. గల్లా జయదేవ్‌ దంపతులు, గల్లా అరుణకుమారి, కృష్ణ కలిసి స్క్రిప్టును దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్యకు అందించారు.

‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఫేం నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ పాత్రలో నటిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గల్లా పద్మావతి నిర్మాత. సూపర్‌స్టార్‌ కృష్ణ, గల్లా అరుణకుమారి కలిసి సినిమాను సమర్పిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆమె కోసం కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu