HomeTelugu Trendingషారుక్ తనయుడికి మరోసారి బెయిల్ తిరస్కరణ

షారుక్ తనయుడికి మరోసారి బెయిల్ తిరస్కరణ

Aryan Khan

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురయింది. ఆర్యన్ ఖాన్‌కు బెయిలు ఇచ్చేందుకు ముంబై ప్రత్యేక కోర్టు నిరాకరించింది. గత నెల 3న ముంబయి తీరంలోని క్రూజ్ నౌకలో ఎన్‌సీబీ అధికారులు చేసిన దాడుల్లో డ్రగ్స్‌తో కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఆర్యన్‌ ఖాన్ కూడా ఉన్నారు. అయితే ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని అతడి తరపున న్యాయవాదులు ఇప్పటికే కోర్టుకు విన్నవించారు.

Aryan Khan2

ఇప్పటికే ఆర్యన్‌ఖాన్ బెయిల్‌ పిటిషన్లను పలుమార్లు కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ ఇస్తే డ్రగ్స్ కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) వెల్లడించింది. గత 14 రోజులుగా ఆర్యన్‌ ఆర్థర్‌రోడ్‌ జైలులోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్‌ బెయిల్‌ను ముంబై కోర్టు తిరస్కరించడం ఇది మూడోసారి. దీంతో షారుక్‌ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్‌ ఆందోళన చెందుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu