ఈ ఏడాది విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా నిర్మాతలకు లాభాలను మిగిల్చింది. ఈ సినిమా సాధించిన రికార్డులు ఇతర భాషలకు చెందిన దర్శకనిర్మాతలను బాగా ఆకర్షించాయి. ఈ కారణంతో ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ లో రణవీర్
సింగ్.. కన్నడలో యష్ రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక తమిళ రీమేక్ లో హీరో ఆర్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా తమిళ హక్కుల కోసం చాలా మంది పోటీ పడ్డారు.
ప్రముఖ హీరో ధనుష్ ఈ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ E4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా తమిళ, మలయాళ రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళ రీమేక్ లో నటించడానికి ధనుష్, శింబు, ఆర్యలు ఆసక్తి చూపగా.. ఆ అవకాశం ఆర్యకు దక్కినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికార ప్రకటన వెలువనుంది.