కోలీవుడ్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘సార్‌పట్ట’. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారాయన. జులై 22 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సూర్య తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఆర్య లుక్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలు అందుకునేలా ట్రైలర్‌ని తీర్చిదిద్దారు. మద్రాసులో నిర్వహించిన బాక్సింగ్ పోటీ సన్నివేశంతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.