తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్యలు నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఎనిమి’. విశార్ హీరో పాత్రలో చేస్తుండగా, ఆర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మంచి స్పందన అందుకున్నా వాటిలో ఎక్కడా ఆర్య కనిపించలేదు. నేడు తాజాగా ఈ సినిమా నుంచి ఆర్య ఫస్ట్ లుక్‌ను విడుదలైంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫస్ట్‌లుక్ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. చేతికి సంకెళ్ళు వేసుకొని దెబ్బలతో ఆర్య కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.