HomeTelugu Big Storiesతండ్రైన ఆర్య.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన సయేషా

తండ్రైన ఆర్య.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన సయేషా

Arya and sayyeshaa blessed

కోలీవుడ్ హీరో ఆర్య భార్య, హీరోయిన్‌ సయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హీరో విశాల్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు. తాను మావయ్య అయ్యానని, చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంద‌ని చెబుతూ విశాల్ ఆర్య‌, స‌యేషాల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఆర్య, సయేషా​ సైగల్‌లది ప్రేమ వివాహం. ‘అఖిల్’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సాయేషా.. ఆ తర్వాత ‘గజినీకాంత్’ అనే మూవీలో ఆర్యతో కలిసి నటించింది. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu