సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్.. 14 రీల్స్ ప్లస్.. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. ఈ మూవీ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో కోట్ల కుంభకోణాల ఆధారంగా ఓ సెటైరికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ వుంటుందని తెలుస్తోంది. ఇందులో హీరో పాత్రతో పాటు విలన్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా వుంటుందట. అలాంటి పాత్రలో ఎవరు నటిస్తారా? అనే అంశంపై ఇన్ని రోజులు చర్చ జరిగింది. కన్నడ హీరో ఉపేంద్ర.. సుదీప్ లతో పాటు తమిళ హీరో అరవింద స్వామి పేరు కూడా వినిపించింది. అయితే తాజా సమాచారం మేరకు.. విలన్ పాత్రకు అరవింద స్వామిని మేకర్స్ ఫైనల్ చేసినట్టు తెలిసింది. ఓ మల్టీ మిలియనీర్ బ్యాంకులకు లక్షల కోట్టు ఎగవేసి విదేశాలకి వెళ్లిపోతే అతన్ని హీరో ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు? ఎలా తిరిగి అతన్ని ఇండియా రప్పించాడు? అన్నదే ఇందులో ప్రధాన కథగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నదనేది తెలియాలంటే అధికారీకంగా ప్రకటించే వరకు ఎదురుచూడాల్సిందే.