టాలీవుడ్‌లో అమ్మగా, అత్తగా సుపరిచితమైన నటి ప్రగతి. ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ ఆంటీ. డాన్స్ చేస్తూ లేదంటే వర్కౌట్స్ చేస్తూ ఈమె నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సినిమాల్లో చాలా పెద్ద వయసు ఆంటీగా కనిపించే ప్రగతి వయసు మామూలుగా అయితే తక్కువే ఉంటుంది. ఆమె చేసిన పాత్రల కారణంగా ఆమెను అంతా ఆంటీ అనేస్తున్నారు. తన ఫిట్ నెస్ ను నిరూపించుకునేందుకు సోషల్ మీడియాలో ఈమె వర్కౌట్ వీడియోలు మరియు ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా మరో సారి ప్రగతి తన వర్కౌట్ ఫొటోలను షేర్ చేసింది. ఈసారి మరింత ఎక్కువగా కష్టపడ్డట్లుగా అనిపిస్తుంది. చెమటలు కార్చి మరీ వర్కౌట్స్ చేసింది. ఫిట్‌నెస్ కోసం ఆమె పడుతున్న కష్టం నలుగురికి ఆదర్శంగా ఉందంటున్నారు. ఈ ఫొటోలతో పాటు ప్రగతి లక్ష్యంను ఎప్పుడు తగ్గించుకోవద్దని దాన్ని సాధించేందుకు ఎక్కువ కష్టపడాలంటూ సలహా ఇచ్చింది.
ఇక హమ్మా హమ్మా.. మ్యూజిక్ వింటేనే రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతారు చాలా మంది యువకులు. ఇక ప్రగతి తన డ్యాన్స్‌తో అలాంటి వారి మతిపోగేట్టేలా హాట్ స్టెప్పులతో షాకిచ్చింది. ఆమె ఫొటోలతో పాటు వీడియో కూడా మరింత హీటెక్కిస్తోంది. చూస్తుంటే సినిమాల్లో ఐటమ్ పాటలో అవకాశం ఇస్తే ప్రగతి సిల్వర్ స్క్రీన్ షేక్ చేసేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.