HomeTelugu Trendingశ్రీవిష్ణు 'అర్జున ఫల్గుణ' టీజర్‌

శ్రీవిష్ణు ‘అర్జున ఫల్గుణ’ టీజర్‌

Arjuna Phalguna teaser is simple yet impressiveటాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా టీజర్‌ని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో శ్రీవిష్ణు ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా నటి అమృతా అయ్యర్‌ సందడి చేయనున్నారు.

క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు నటన ఆకట్టుకునేలా ఉంది. ‘‘నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడ్ని కాదు.. అర్జునుడ్ని’’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన సంభాషణలు మెప్పించేలా ఉన్నాయి. నరేశ్‌, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవి ప్రసాద్‌, మహేశ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!