అర్జున్ రెడ్డి సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగ తెలుగులో సినిమా చేస్తారు అనుకుంటే.. ఏకంగా బాలీవుడ్ కు వెళ్లి అర్జున్ రెడ్డిని రీమేక్ చేశారు. షాహిద్ కపూర్ హీరోగా చేసిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్నది. నాలుగు రోజుల్లో వందకోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
ఈ సినిమాతో బాలీవుడ్ లో దర్శకుడిగా తనను తానూ ప్రూవ్ చేసుకున్న సందీప్ రెడ్డికి టి సీరీస్ రూపంలో మరో అవకాశం వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తో సినిమా చేసే అవకాశం టి సీరీస్ కల్పించింది. సందీప్ తో సినిమా చేసేందుకు సల్మాన్ కూడా ఒకే చేశారట. సో, త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయటకు రావొచ్చు.