HomeTelugu Trendingమలైకాతో పెళ్లికి సిద్ధంగా లేను: అర్జున్‌ కపూర్‌

మలైకాతో పెళ్లికి సిద్ధంగా లేను: అర్జున్‌ కపూర్‌

Arjun kapoor
బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. తన భర్త నుంచి విడాకులు తీసుకున్న వెంటనే అర్జున్ తో మలైకా డేటింగ్ చేయడం ప్రారంభించింది. సినిమాల కంటే కూడా ప్రేమ వ్యవహారంతోనే వీరిద్దరూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీటౌన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Arjun kapoor response malai

అయితే ‘కాఫీ విత్ కరణ్’ షోకి గెస్ట్ గా వచ్చిన అర్జున్ కపూర్ ఈ వ్యవహారంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఈ షోలో మలైకాతో అఫైర్, పెళ్లిపై ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. తాను, మలైకాని ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేమని ఈ సందర్భంగా అర్జున్ చెప్పాడు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు సినిమాలు లేకుండానే గడిచిపోయాయని… ఇప్పుడు తాను కెరీర్ పై దృష్టి సారించాలనుకుంటున్నానని తెలిపాడు. తన పని తనకు సంతోషాన్ని ఇస్తుందని… తాను సంతోషంగా ఉన్నప్పుడే తన భాగస్వామిని సంతోషపెట్టగలనని చెప్పాడు. ఇప్పటికైతే పెళ్లి ఆలోచనలు లేవని స్పష్టం చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu