HomeTelugu Newsమలైకా అరోరా పెళ్లి పై మొదటి భర్త అర్బాజ్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

మలైకా అరోరా పెళ్లి పై మొదటి భర్త అర్బాజ్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

4 29బాలీవుడ్‌ నటి మలైకా అరోరా.. బోనీ కపూర్‌ కుమారుడు అర్జున్‌ కపూర్‌ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్‌ 15న వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు.. మలైకా మొదటి భర్త అర్బాజ్‌ ఖాన్‌ను అడిగాయి. ఇందుకు అర్బాజ్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘మీరు చాలా తెలివైన ప్రశ్న అడిగారు. రాత్రంతా ఈ విషయం గురించి ఆలోచించి చాలా కష్టపడినట్లున్నారు. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి. ఈ విషయం గురించి నన్ను ప్రశ్నించేందుకు మీరు కొంత సమయం తీసుకున్నారు కదా.. సమాధానం చెప్పడానికి నాకూ కాస్త సమయం ఇవ్వండి’ అని చమత్కరిస్తూ మాటదాటేశారు అర్బాజ్. మలైకా, అర్బాజ్‌లు తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మలైకా.. అర్జున్‌తో, అర్బాజ్‌.. జార్జియా ఆండ్రియానీతో ప్రేమలో ఉన్నారు. మలైకా, అర్బాజ్‌కు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu