ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం కన్నుమూశారు. మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కరీమా బేగానికి నలుగురు సంతానం. వీరిలో ఏఆర్ రెహమాన్ చిన్నవాడు. కరీమా భర్త ఆర్‌కే శేఖర్ రెహమాన్ తొమ్మిదేళ్ల వయస్సులోనే మరణించారు. ప్రస్తుతం ఆయన తల్లి కూడా మృతి చెందాడు. మరోవైపు రెహమాన్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.