
AR Rahman remuneration for RC16:
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ‘RC16’ గురించి అందరికీ తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. అందుకే, చిత్రబృందం సంగీత విభాగానికి భారీ ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.
సంగీతప్రేమికులకు ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే, రెహ్మాన్ మ్యూజిక్ అంటే ఓ మేజిక్! ఆయన టచ్ పడితే సినిమా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం. మరీ ముఖ్యంగా, ఈ సినిమా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ థీమ్‌తో తెరకెక్కుతుండటంతో, రహ్మాన్ మ్యూజిక్ మరింత మేజిక్ చేయనుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం ఏఆర్ రెహ్మాన్‌కు భారీగా రూ. 8 కోట్లు రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారు. ఇదొక రికార్డు స్థాయిలో ఉన్న పారితోషికం. రెహ్మాన్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ మ్యూజిక్ అందిస్తే, సినిమాకి ముందస్తుగా మంచి బిజినెస్ అవ్వడం ఖాయం. ఈ సినిమా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుండటంతో, రెహ్మాన్ పేరు మరింత బూస్ట్ ఇస్తుందనడంలో సందేహం లేదు.
‘RC16’ లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను విరుద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నారు.
ఇక, రెహ్మాన్ కంపోజ్ చేసే ఆల్బమ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి సూపర్ హైప్ క్రియేట్ అయింది. త్వరలోనే రెహ్మాన్ మ్యూజిక్ సెషన్స్ మొదలవ్వనున్నాయి. మరి, రెహ్మాన్ మ్యాజిక్‌తో ఈ సినిమా ఎంతలా మ్యూజికల్ సెన్సేషన్ అవుతుందో చూడాలి!
ALSO READ: Andhra Pradesh లో ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ వెనుక కారణం ఎవరు?