ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ అర్హతలేని సినిమాలను ఆస్కార్‌కు పంపిస్తున్నారని ఆరోపించాడు. కొన్ని సార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయని రెహమాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఏ.ఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.
అర్హత ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను ఆస్కార్ పంపకపోవడంపై ఇన్‌డైరెక్ట్‌గా ఏ.ఆర్ రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో రెండు ఆస్కార్‌లు సాధించి చరిత్ర సృష్టించాడు.
ఇక ఎప్పుడెప్పుడా అని ఏండ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఆస్కార్‌ను కీరవాణి, చంద్రబోస్‌లు సొంతం చేసుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌తో ఆ కళ తీరిపోయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్‌ను గెలిచి తెలుగు ఖ్యాతిని ప్రపంచం శిఖరంపై నిలబెట్టింది.నిజానికి ఇండియా నుంచి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ నామినేషన్ దక్కలేదు.
ఆర్‌ఆర్‌ఆర్‌కు బదులు గుజరాతి చిత్రమైన చెల్లో షోను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపించారు. కానీ ఇది ఫైనల్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. దాంతో చాలా మంది సినీ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను పంపిస్తే ఉత్తమ చిత్రం విభాగంలో కూడా ఆస్కార్ వచ్చేదని పలువురు నెటీజన్లు వ్యక్తం చేశారు. కాగా ‘చెల్లో షో’సినిమాను గతేడాది కూడా ఆస్కార్‌కు పంపించారు. అప్పుడు కూడా ఫైనల్ నామినేషన్‌లో చోటు దక్కించుకోలేకపోయింది.
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు