ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ తనకు వెంటనే పోలీసు భద్రత ఇప్పించాలంటూ.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్‌ను వేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘దర్బార్’ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 9న భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్ల ‘దర్బార్’ను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టాలను ఎదుర్కొన్నారు. దీంతో రజనీకాంత్‌తో పాటు దర్శకుడు మురుగదాస్‌ను నష్టపరిహారం చెల్లించమని కోరుతామని పలువురు డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇటీవల రజనీకాంత్‌ను కలిసి తమ ఇబ్బందులు ఆయనతో పంచుకుని నష్టపరిహారాన్ని కోరుదామని కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఆయన నివాసానికి వెళ్లగా.. అక్కడే ఉన్న పోలీసులు అనుమతి లేదని చెప్పి వారిని వెనక్కి పంపించేశారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి డైరెక్టర్ మురుగదాస్‌ను కలవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నివాసానికి వెంటనే పోలీస్ భద్రతను ఇప్పించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో మురుగదాస్ పిటిషన్ వేశారు. ఇప్పటికే ‘దర్బార్’ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ను కలిసిన డిస్ట్రిబ్యూటర్లు.. ‘దర్బార్’ సినిమా వల్ల తాము ఎంతగానో నష్టపోయామని ఎంతో కొంత నష్టపరిహారం అందిమని కోరారు. తాము కూడా తీవ్రంగా నష్టాల్లో ఉన్నామని, కాబట్టి ఎలాంటి సాయం చేయలేమని లైకా ప్రొడక్షన్స్ వారు వివరించారు.