సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అప్పుడు – ఇప్పుడు’. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మించిన ఈ సినిమాకి చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్నాడు. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..’ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన పాటకు మంచి స్పందన వస్తోంది. తాజాగా మూవీ టీజర్ ను పూరి జగన్నాథ్ విడుదల చేశారు” అని అన్నారు.
డైరెక్టర్ చలపతి పువ్వల మాట్లాడుతూ.. “మా అప్పుడు-ఇప్పుడు చిత్రం టీజర్, సాంగ్స్ మంచి పాపులర్ అయ్యాయి. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా చాలా చక్కగా నటించారు. మేకింగ్ లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనాభ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు హైలైట్” అని అన్నారు.